నాని సర్‌ప్రైజింగ్ అప్‌డేట్.. అదిరిపోయే కాన్సెప్ట్‌తో పోస్టర్
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జెర్సీ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత మళ్లీ తన శైలికి తగ్గ కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఇంద్రగంటి మోహనకృష్ణతో V చిత్రాన్ని చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే మరో సినిమాను చేస్తున్నాడు. తాజాగా మరో మూవీ అప్‌డేట్‌ను కూడా వదిలాడు.
నాని ప్రస్తుతం వీ (V) చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈ మూవీ ఉగాదికి సందడి చేసేందుకు సిద్దమైంది. మరోపక్క టక్ జగదీష్ కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఊపులో మరో కొత్త సినిమా అప్‌డేట్‌ను కూడా వదిలాడు.

సితారా ఎంటర్టైన్మెంట్‌పై మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. అసలే వరుస విజయాలతో దూకుడు మీదున్న ఈ సంస్థ.. నాని 27వ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది. రేపు ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం 4.05 గంటలకు ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా కొత్తగా ఉంది. టైప్ మిషన్‌పై టైప్ చేసినట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ చూస్తే.. ఈ కథ కూడా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











