శ్రీకాంత్ అడ్డాలకు నాని షాక్..

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మహేష్ బాబుతో రూపొందించిన బ్రహ్మోత్సవం చిత్రం అట్టర్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ ఈ దర్శకుడికి ముఖం చాటేసింది. అప్పటి నుంచి కథలు రాసుకొంటూ పలువురిని కలుస్తూ మరో సినిమా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

తాజాగా నేచురల్ స్టార్ నానితో శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమాను రూపొందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ మూవీకి కూచిపూడి వారి వీధి అనే టైటిల్ కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. నాని కూడా కథ ఓకే చేయించారనే కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో నాని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. మరో విభిన్నమైన చిత్రంలో నటించబోతున్నారనే ఫీలింగ్ లోనయ్యారు.

Nani about movie with Srikanth Addala

అయితే తాజాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నానితో ప్రస్తావన తీసుకురాగా నాని షాకిచ్చారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ అవాస్తవాలే అంటూ నాని రిప్లై ఇచ్చాడు. దాంతో వీరి కాంబినేషన్‌లో మూవీ రాలేదనేది స్పష్టమైంది. దాంతో ప్రస్తుతం మళ్లీ శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి మొదటికి వచ్చింది.

జెర్సీ తర్వాత వరుస సినిమాలతో నాని దూసుకెళ్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకు మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. అలాగే దిల్ రాజు నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X