రక్షకుడు, రాక్షసుడు వచ్చేస్తున్నారు.. నాని, సుధీర్ బాబు ట్వీట్స్ వైరల్
అష్టాచమ్మా, జెంటిల్‌మేన్, సమ్మోహనం లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి విజయం సాధించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మాతో నానికి, సమ్మోహనంతో సుధీర్ బాబుకు తిరుగులేని హిట్ ఇచ్చిన దర్శకుడు.. వీరిద్దరితో వీ (V) అనే భారీ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాని నెగెటివ్ రోల్ పోషిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'వీ'.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది.
ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ప్రధాన పాత్రధారులైన సుధీర్ బాబు, నాని ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతోన్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు వీరిద్దరు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ముందు నుంచీ నాని, సుధీర్ పాత్రలపై అంచనాలు పెంచుతూ వచ్చిన.. మూవీ యూనిట్ వారి ఫస్ట్ లుక్‌తో భారీ హైప్‌ను క్రియేట్ చేసేందుకు సిద్దమయ్యారు.

'కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు ... "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని ..... వాడే ఇప్పుడొస్తున్నాడు ... "రక్షకుడు" వస్తున్నాడు ' అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నాని రిప్లై ఇస్తూ.. ఓహో... అలాగా... సరే! అని ట్వీట్ చేశాడు. ఈ నెల 27వ తేదీన 'రక్షకుడు' ఫస్ట్ లుక్ (సుధీర్ బాబు)ను .. 28వ తేదీన 'రాక్షసుడు' ఫస్టులుక్ (నాని)ను వదలనున్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











