twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉగాది రోజు పచ్చడే పచ్చడి.. నాని, సుధీర్ బాబు ట్వీట్స్ వైరల్

    |

    అష్టాచమ్మా, జెంటిల్‌మేన్, సమ్మోహనం లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి విజయం సాధించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మాతో నానికి, సమ్మోహనంతో సుధీర్ బాబుకు తిరుగులేని హిట్ ఇచ్చిన దర్శకుడు.. వీరిద్దరితో వీ (V) అనే భారీ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'వీ'.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది.

    రక్షకుడిగా సుధీర్ బాబు..

    రక్షకుడిగా సుధీర్ బాబు..

    వీ చిత్రంలో రక్షకుడిగా హీరో పాత్రను పోషిస్తున్న ‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు ... "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని ..... వాడే ఇప్పుడొస్తున్నాడు ... "రక్షకుడు" వస్తున్నాడు ' అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నాని రిప్లై ఇస్తూ.. ఓహో... అలాగా... సరే! అని ట్వీట్ చేశాడు. ఈ నెల 27వ తేదీన 'రక్షకుడు' ఫస్ట్ లుక్ (సుధీర్ బాబు)ను విడుదల చేయగా భారీ స్పందన వచ్చింది.

    రాక్షసుడిగా నాని..

    రాక్షసుడిగా నాని..

    28వ తేదీన 'రాక్షసుడు' ఫస్టులుక్ (నాని)ను వదిలారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో గుబురు గడ్డం, మెలితిరిగిన మీసాలతో కలిపిస్తున్న నాని చేతిలో చిన్న కత్తెర పట్టుకున్నాడు. చాలా సీరియస్‌గా నాని లుక్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో నానిని చూడొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్స్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

     అందరికీ థ్యాంక్స్..

    అందరికీ థ్యాంక్స్..

    ‘వీ మూవీ నుంచి వదిలిన ఫస్ట్ లుక్స్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మీ అందరీ ట్వీట్స్ చదివాను.. మీ ఎడిట్స్ కూడా చూశాను.. మేము ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాము.. ఉగాది రోజు పచ్చడి పచ్చడే' అంటూ నాని ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Nani's V First Look || Nani Turns Villain for 'V'
    ఆ జెంటిల్‌మేన్ చెప్పినట్టు..

    ఆ జెంటిల్‌మేన్ చెప్పినట్టు..

    నాని చేసిన ఈ ట్వీట్‌కు సుధీర్ బాబు స్పందిస్తూ.. ‘రక్షకుడు, రాక్షసుడు లుక్స్‌కు మీరిచ్చిన రెస్పాన్స్‌కు మా టీమ్ తరుపున ధన్యవాదాలు. మీరు మాలో ఇంకాస్త ఎనర్జీని నింపారు.. ఈ జెంటిల్‌మేన్ చెప్పినట్టు నిజంగానే ఉగాది రోజు పచ్చడి పచ్చడే' అని చెప్పుకొచ్చాడు. అంటే ఈ మూవీ ఉగాది కానుకగా రిలీజ్ కాబోతోందని పరోక్షంగా చెప్పారు.

    English summary
    Nani And Sudheer Babu Says Thanks To Public Response For First Looks. Indraganti Mohanakrishna Directing This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X