హిట్టిచ్చిన దర్శకుడితో నాని న్యూ మూవీ.. మరో కిక్కిస్తారా?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా అందులో మినిమామ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆడియెన్స్ నమ్మకంతో సినిమాకు వెళతారు. మినిమామ్ గ్యారెంటీ వసూళ్లను అందుకోవడంలో ముందుండే నాని నెక్స్ట్ ఒక థ్రిల్లర్ కథను టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక దర్శకుడు మరెవరో కాదు. HIT సినిమాతో నాని ప్రొడక్షన్ కి మంచి సక్సెస్ ఇచ్చిన శైలేష్ కొలను. హిట్ సినిమా సక్సెస్ కావడంతో నాని ఆ దర్శకుడికి మరొక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో నాని హీరోగా నటించడానికి రెడీ అయ్యారట. అయితే దర్శకుడు ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. నెక్స్ట్ నాని V సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ లీడర్ సినిమా సక్సెల్ కాకపోవడంతో ఈ సినిమాతో సాలీడ్ సక్సెస్ ని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇక శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసిన అనంతరం వచ్చే ఏడాది హిట్ దర్శకుడితో సినిమా చేయాలని నాని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











