Ante Sundaraniki Trailer: నాని కామెడీ టైమింగ్ మామూలుగా లేదు.. ఈసారి అంతకుమించి!

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక విభిన్నమైన పాయింట్ హైలెట్ అయ్యే విధంగా తన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే చాలా రోజులుగా నాని ఫ్యాన్స్ ఎక్కువగా అతని నుంచి కామెడీ సినిమాను కోరుకుంటున్నారు. నిజానికి నాని ఆ జానర్ లో సినిమా చేసి చాలా కాలం అయింది. అందుకే ఈసారి పూర్తి స్థాయిలో కామెడీతో మెప్పించాలని. 'అంటే.. సుందరానికి' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

ఫుల్ కామెడీ

ఫుల్ కామెడీ

నాని ఇంతకుముందు ఫ్యామిలీ త్రిల్లర్ లవ్ ఫ్యాక్షన్ సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చివరగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ లవ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పూర్తి స్థాయిలో నాన్ స్టాప్ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. అంటే సుందరానికి అనే సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది అని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్లారిటీ చేశారు.

హావభావాలతో మెప్పించిన నాని

హావభావాలతో మెప్పించిన నాని

మొదట వచ్చిన టీజర్ కూడా చాలా కామెడీగానే హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. జూన్ 10 వ తేదీన రాబోతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అయితే అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే నాని ట్రైలర్లో విభిన్నమైన హావభావాలతో ఎంతగానో మెప్పించాడు. డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఉంది.

 క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమ..

క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమ..

హిందు కుటుంబంలో పూర్తిస్థాయిలో ఆచారాలు పాటిస్తూ ఉండే సుందరం ఊహించని విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అంతేకాకుండా అమెరికా వెళ్లాలని ఆశలో కూడా ఉంటాడు. ఇక తను ప్రేమించిన అమ్మాయి క్రిస్టియన్ అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇంట్లో ఆ విషయాన్ని చెప్పలేక ఎంతగానో సతమత మవుతూ ఉంటాడు.

నరేష్ టైమింగ్

నరేష్ టైమింగ్

హర్షవర్ధన్ తో తనకు సంబంధించిన అనేక విషయాల గురించి చెబుతూ నాని సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక మరోవైపు నానికి తండ్రి గా నటించిన నరేష్ పాత్ర కూడా అల్టిమేట్ కామెడీ గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఆయన చెబుతున్న డైలాగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. మనది చాలా మంచి ఫ్యామిలీ అని చెప్పి ఒప్పిచింది అని నాని అనగానే.. చెప్పి ఒప్పించడం ఏమిటి మనది మంచి కుటుంబం కాదా అని నరేష్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా వర్కవుట్ అవ్వలేదు.

చివరలో కూడా మరో హైలెట్..

చివరలో కూడా మరో హైలెట్..

ట్రైలర్ చివరలో కూడా టీవీలో క్రిస్టియన్ ప్రసంగం చూస్తున్న నాని.. పేరెంట్స్ సడన్ గా రాగానే శ్రీ శ్రీనివాసం అనే పాటకు ఛానెల్ మార్చేయడం కూడా హైలెట్ అయ్యింది. ఏదేమైనప్పటికీ కూడా నాని మరోసారి అల్టిమేట్ కామెడీ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంతకుముందు వివేక్ ఆత్రేయ.. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా.. అనే సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ దర్శకుడితో నాని మొదటిసారి చేస్తున్న 'అంటే సుందరానికి' సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X