Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
టాలీవుడ్‌కు హీరోయిన్ నజ్రియా ఫహాద్ లేఖ.. అంటే సుందరానికి స్పెషల్ అంటూ
కొన్నేళ్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే శివ నిర్వాణ తెరకెక్కించిన 'టక్ జగదీష్' అనే సినిమాను పూర్తి చేసిన అతడు.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అదే సమయంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీని కోసం భారీ ఖర్చుతో కోల్‌కతా నగరాన్ని పోలిన సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని మరో సినిమాను మొదలు పెట్టేశాడు.
'బ్రోచేవారెవరురా', 'మెంటల్ మదిలో' వంటి వినూత్నమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాని. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.
'అంటే.. సుందరానికీ' షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో హీరోయిన్ నజ్రియా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు ఓ లేఖను రాసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దాన్ని షేర్ చేసింది. అందులో 'అందరికీ నమస్కారం. ఈరోజు నా మొట్టమొదటి తెలుగు సినిమా షూటింగ్ మొదలు పెట్టాను. మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. అంటే సుందరానికీ నా జీవితంలో చాలా స్పెషల్' అని పేర్కొంది. దీంతో ఆమెకు స్వాగతం పలుకుతూ ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి నజ్రియ 'రాజా రాణి' అనే డబ్బింగ్ సినిమాతో ఇది వరకే తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.