నాని ‘సుందరం’గా మారేది అప్పటి నుంచే: డిఫరెంట్ మూవీకి ముహూర్తం ఫిక్స్
సహజ సిద్ధమైన నటనతో కెరీర్ ఆరంభంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే అతడు.. రెండేళ్లుగా ఒక్కొక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్పీడు పెంచేసిన నాని.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రెండు సినిమాలను ప్రకటించిన తర్వాత కూడా కొద్ది రోజుల క్రితం 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడతను.
'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాని. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మే మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

హైదరాబాద్‌లో జరగనున్న మొదటి షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత విదేశాల్లో కొన్ని పాటలను షూట్ చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాని 'శ్యామ్ సింగరాయ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతుందని అంటున్నారు. అలాగే, అతడు నటించిన మరో చిత్రం 'టక్ జగదీష్' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











