ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నాని.. ఇలా మొదలెట్టి అలా పూర్తి చేసేశాడుగా!

ఎవరి సపోర్టు లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే సహజ సిద్ధమైన నటనతో నేచురల్ స్టార్‌గా ఎదిగిపోయాడు టాలెంటెడ్ హీరో నాని. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తే అతడు.. ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న నాని.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ, భారీ సక్సెస్ మాత్రం అతడికి దక్కడం లేదనే చెప్పాలి.

గత ఏడాది నాని 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కానీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అవడంతో నిరాశ తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో వచ్చాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు కూడా అదే రీతిలో వచ్చాయి. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.

 Nanis Ante Sundaraniki Shoot wrapped

ఇక, నాని చాలా రోజుల క్రితమే 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాని. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల కూడా అనుకున్న టైం‌కు కాలేదు.

'శ్యామ్ సింగ రాయ్' మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న నాని.. ఇటీవలే 'అంటే.. సుందరానికీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించాడు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో షెడ్యూళ్లను కూడా జరుపుకున్నారు. ఇలా దాదాపు నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ బ్రేకులు లేకుండా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను మూవీ యూనిట్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో నేచురల్ స్టార్ నాని అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న ఓ వీడియోను సైతం షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి స్థాయిలో విభిన్నమైన సబ్జెక్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడని ఇప్పటి వరకూ విడుదలైన పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. దీన్ని ఈ ఏడాది సమ్మర్‌కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X