For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని సినిమా నుంచి స్పెషల్ గిఫ్ట్: రెండు గెటప్‌లతో సర్‌ప్రైజ్ చేసిన సుందరం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నేచురల్ స్టార్ నాని ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా బాగా పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది చివర్లో 'శ్యామ్ సింగ రాయ్'తో భారీ సక్సెస్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

  మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

  నేచురల్ స్టార్ నాని చాలా రోజుల క్రితమే 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గతంలో చూడని ఓ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ , 'రాజా రాణి' ఫేం నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.

  Nanis Ante Sundaraniki Teaser on April 20th

  వాస్తవానికి 'అంటే.. సుందరానికీ' మూవీని ఎప్పుడో పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కరోనా లాక్‌డౌన్స్‌తో పాటు పలు కారణాల వల్ల చాలా ఆలస్యం చేశారు. ఇక, నాని కూడా ఈ సినిమా కంటే ముందు 'శ్యామ్ సింగ రాయ్'ను పూర్తి చేసుకున్నాడు. అది సూపర్ హిట్ అవడంతో ఆ ఉత్సాహంతోనే దీన్ని కూడా ఇటీవలే కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించేశారు. అవి కూడా ఇప్పుడు దాదాపుగా పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

  Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

  నాని నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అంటే.. సుందరానికీ' మూవీ నుంచి ఇప్పటికే పలు రకాల పోస్టర్లు వచ్చాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా వెలువడింది. ఇందులో దీన్ని ఏప్రిల్ 20న ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, చిత్ర యూనిట్ రెండు పోస్టర్లను కూడా విడుదల చేసింది. ఇందులో ఒక దానిలో నాని, నజ్రియా హిందూ పద్దతిలో సంప్రదాయమైన దుస్తులు ధరించి కనిపించారు. మరోదానిలో క్రిస్టియన్ మ్యారెజ్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. దీంతో వీటికి మంచి స్పందన దక్కుతోంది.

  Nanis Ante Sundaraniki Teaser on April 20th

  క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం జూన్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

  English summary
  Natural Star Nani Now Doing Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction. This Movie Teaser Will Release on April 20th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X