twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమకు మతాలతో ముడిపెడుతూ నాని మూవీ.. అంటే అసలైన ట్విస్ట్ మాత్రం సస్పెన్స్

    |

    అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు టాలెంటెడ్ గాయ్ నాని. సహజ సిద్దమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చడంతో పాటు నేచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఫలితంగా ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత కొంత కాలం పాటు అతడికి భారీ బ్రేక్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

    చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!

    నాని ఈ మధ్య కాలంలో పలు సినిమాలు చేశాడు. అందులో ఒక్కటి మాత్రమే థియేటర్లలో విడుదలైంది. అదే.. 'శ్యామ్ సింగ రాయ్'. పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నాని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ ఉత్సాహంతోనే అతడు ఇటీవలే 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసుకున్నాడు. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గతంలో చూడని ఓ కొత్త కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ 'రాజా రాణి' ఫేం నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా చేస్తోంది.

    Nanis Ante Sundaraniki Teaser Released

    వినూత్నమైన కథతో రాబోతున్న 'అంటే.. సుందరానికీ' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే కరోనా లాక్‌డౌన్స్‌తో పాటు పలు కారణాల వల్ల చాలా ఆలస్యం చేశారు. ఇక, నాని కూడా ఈ సినిమా కంటే ముందు 'శ్యామ్ సింగ రాయ్'ను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అంటే ఈ సినిమా టాకీ పార్ట్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించేశారు. అవి కూడా ఇప్పుడు దాదాపుగా పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

    Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

    నాని నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అంటే.. సుందరానికీ' మూవీని త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నానిని బ్రాహ్మణుడిగా చూపించారు. ముందుగా అతడి ఫ్యామిలీ, వ్యక్తిత్వం గురించి పరిచయం చేసిన తర్వాత.. హీరోయిన్ నజ్రియాను క్రిస్టియన్ అమ్మాయిగా పరిచయం చేశారు. రెండు వేరు వేరు మతాలకు చెందిన వీళ్లిద్దరూ ప్రేమలో పడడం దాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటివి ఫన్నీగా చూపించారు. ఇక, చివర్లో మాత్రం 'అంటే.. అంటే' అంటూ హీరోకు ఏదో పెద్ద సమస్య ఉందని ఏదేదో సైగలు చేస్తూ సస్పెన్స్‌గా ముగించారు. ఇక, ఈ టీజర్‌లో విజువల్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

    'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం జూన్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

    English summary
    Natural Star Nani Now Doing Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction. Now This Movie Teaser Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X