షూట్ కి ముందే 100 కోట్లు.. యువ హీరో బోల్డ్ సినిమా రికార్డ్..!

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న యువ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. కాగా నాని హీరోగా నటించిన లాస్ట్ అన్ని సినిమాలు దాదాపు మంచి నిలకడ వసూళ్లు సాధించి తనని టైర్ 2 హీరోస్ లో టాప్ 1 ప్లేస్ లో నిలిపాయి. కాగా ఇలా నాచురల్ స్టార్ తెలుగు మార్కెట్ లో తన సత్తా చాటుతూ రానున్న సినిమాలతో కూడా ఊహించని రేంజ్ లో అంచలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నారు.

కాగా ఇపుడు నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా నాని అదరగొడుతూ ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుతున్నారు. అయితే నాని విషయంలో మరో కామెంట్ తెలుగు సినిమాలో గట్టిగా వినిపిస్తుంది. ఒకప్పుడు నానిని ఓటిటి స్టార్ అని ట్రోల్ చేసేవారు కానీ ఇపుడు ఇదే టాగ్ నుంచి ఓటిటిలో ఇంకా సినిమా రిలీజ్ కాక ముందే కాదు కదా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే రికార్డు ఓటిటి డీల్ ని తాను సొంతం చేసుకున్నాడు.

nani controversial film get a record deal 100 cr before shoot

నాని సినిమాలు అంటే ఓటిటిలో మంచి డిమాండ్ ఉంది. కాగా ఇలానే తన నుంచి రానున్న ఓ భారీ సినిమాలు ఓటిటి సహా ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు ఒక్క దానితోనే ఏకంగా 100 కోట్ల బిజినెస్ ని చేసేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు కొన్ని రోజులు కితమే ఊహించని బోల్డ్ టీజర్ తో సెన్సేషన్ రేపిన చిత్రం ది ప్యారడైజ్ కి అట.

కాగా నాని బ్లాక్ బస్టర్ హిట్ దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ప్లాన్ చేసిన ఈ సినిమాని నాని ఇండియన్ మ్యాడ్ మాక్స్ లా ఉంటుంది అని చెబుతున్నాడు. దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇపుడు ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే ఈ చిత్రానికి ఓటిటి డీల్ గా ఏకంగా 70 కోట్ల దగ్గర డీల్ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లేదా, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా వినికిడి.

ఇక ఇవి కాకుండా శాటిలైట్ హక్కులు మరియు ఆడియో హక్కులు కలిపి మరో 30 కోట్ల మేర డీల్ జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ భారీ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే 100 కోట్ల బిజినెస్ చేసి తెలుగు సినిమా దగ్గర రికార్డు అందుకుంది అని చెప్పవచ్చు. మెయిన్ గా నాని రేంజ్ హీరోస్ లో అయితే ఇది బిగ్గెస్ట్ రికార్డే అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక సినిమా పూర్తయ్యి థియేట్రికల్ రిలీజ్ కి ఏ రేంజ్ డిమాండ్ వస్తుందో చూడాలి మరి. కాగా ఇపుడు నాని హిట్ 3 సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా కంప్లీట్ చేసిన వెంటనే కొత్త మేకోవర్ తో ది ప్యారడైజ్ సెట్స్ లోకి తాను దిగనున్నాడు. ఈ సినిమా ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

More from Filmibeat

Read more about: nani hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X