twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dasara Friendship Day poster: నాని ఊర మాస్ గ్యాంగ్ మామూలుగా లేదు.. స్పెషల్ పోస్టర్ వైరల్

    |

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ దసరా సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం నాని చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి తెలంగాణ యాసలో నాని ప్రేక్షకులకు సరికొత్తగా అలరించచబోతున్నాడు. గోదావరిఖని సింగరేణి కోలార్ మైన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

    కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ కూడా నిర్మాతలు ఏమాత్రంవెనకడుగు వేయడం లేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే అంచనాల స్థాయిని పెంచేసాయి.

    Nani dasara movie special friendship day poster released

    ఇక నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మరొక ప్రత్యేకమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది. అందులో నాని అతని స్నేహితులు అందరూ చాలా ఆనందంతో కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఫుల్ మాస్ కమర్షియల్ సినిమాగా తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

    ఇక ఈ సినిమా షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసే త్వరలోనే విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక షూటింగ్ ఫినిష్ చేసిన తర్వాత నాని కూడా అన్ని భాషల్లో రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా చేయాలని అనుకుంటున్నాడు. తన కెరీర్ కు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా కావడంతో నాని పక్క ప్రణాళికతో సినిమాను జనాలలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Nani dasara movie special friendship day poster released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X