For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dasara: అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. హింట్ కూడా ఇచ్చేశాడుగా!

  |

  బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి నటనతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నాని. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన అతడు.. ఎన్నో విజయాలను అందుకున్నాడు. తద్వారా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య 'జెర్సీ'తో భారీ హిట్‌ను అందుకున్న నాని.. ఆ తర్వాత అలాంటి విజయం కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగానే 'గ్యాంగ్ లీడర్', 'V', 'టక్ జగదీష్' వంటి మూవీలను చేశాడు. కానీ, ఇవేమీ అతడికి కావాల్సిన హిట్‌ను మాత్రం ఇవ్వలేదు.

  Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' గత ఏడాది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పునర్జన్మల నేపథ్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యన్ వైవిధ్యమైన కథతో రూపొందించాడు. మంచి బిజినెస్‌ను జరుపుకున్న ఈ సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ దక్కింది. దీనికితోడు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరించారు. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగానే సొంతం అయ్యాయి. మొత్తంగా ఈ మూవీ రన్ క్లోజ్ అయ్యే సరికి నిర్మాతలకు రూ. 4 కోట్ల వరకూ లాభాలు వచ్చాయి. దీంతో నాని కెరీర్‌లో మరో హిట్ వచ్చినట్లు అయింది.

   Nani Dasara Movie Surprise on March 20th

  ప్రస్తుతం నాని 'అంటే సుందరానికీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు 'దసరా' అనే వైవిధ్యమైన మాస్ కథతో రాబోతున్నాడు. గత ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఇందులో నాని తెలంగాణ యాసలో 'ఈ దసరా నిరుళ్లెక్కుండదీ.. బాంచత్ జెమ్మి వెట్టి జెప్తున్నా.. బద్దల్ బాసింగాలైతై.. ఎట్లైతే గట్లే సూస్‌కుందాం' అంటూ చెప్పే డైలాగ్ గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది. దీనికితోడు అతడి లుక్ కూడా మెస్మరైజ్ చేస్తోంది. దీంతో ఆరంభంలోనే ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

  శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

  ఇక, ఇటీవలే నాని 'దసరా' మూవీ షూటింగ్‌లో భాగం అయ్యాడు. దీన్ని కూడా శరవేగంగా జరిపేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక, ఇందులో అతడు వైవిధ్యమైన గెటప్‌తో దర్శనమివ్వబోతున్నాడు. దీనికోసం తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా బాగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా 'దసరా' మూవీ గురించి ఓ ప్రకటన వెలువడింది. ఈ సినిమా నుంచి మార్చి 20 అంటే ఆదివారం ఉదయం 11.34 గంటలకు అదిరిపోయే సర్‌ప్రైజ్ రాబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపిన నాని.. 'అది ఫస్ట్ లుక్కా? గ్లిమ్సా? రెండు కలిపి రాబోతున్నాయా' అనే క్యాప్షన్‌ను పెట్టాడు. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  పూర్తి స్థాయి విభిన్నమైన కథతో రాబోతున్న 'దసరా' మూవీని శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయబోతున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

  English summary
  Tollywood Star Hero, Natural Star Nani Now Doing Dasara Movie Under Srikanth Odela Direction. This Movie Surprise on March 20th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X