పెంగ్విన్ ట్రైలర్ రిలీజ్: కీర్తి సురేష్‌కు ఆ ముగ్గురు హీరోల సపోర్ట్!
అందాల నటి కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రానికి దక్షిణాది పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల నుంచి భారీ మద్దతు లభిస్తున్నది. కరోనా కారణంగా సినీ పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను నలుగురు హీరోయిన్లు టీజర్ లాంచ్ చేశారు. తెలుగులో సమంత, హిందీ నుంచి తాప్సి, తమిళంలో త్రిష, ఇక మలయాళంలో మంజు వారియర్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రమోషన్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ ట్రైలర్ లాంచ్‌ను నానీ, ధనుష్, మోహన్‌లాల్ చేతులు మీదుగా రిలీజ్ చేయడానికి ముహుర్తం నిర్ణయించారు. తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్‌లాల్‌తో ట్రైలర్‌ను గురువారం మే 11తేదీన 12 గంటలకు రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల మూసివేతతో ఇప్పటికే జ్యోతిక నటించిన పొనుమగల్ వాందల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా అమెజాన్‌లో జూన్ 19న రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











