నేను సింబా.. ముఫాసా కొడుకును: వైరల్ అవుతున్న నాని వీడియో
''మా నాన్న ఓసారి చెప్పారు.. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని... నేను సింబా ముఫాసా కొడుకుని'' అంటూ నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ 'లయన్ కింగ్'లో ముఫాసా అనే సింహం పాత్రకు నాని తన గాత్రం అందించారు.

ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చిన 'లయన్ కింగ్'.... 1990లో 2డి ఆనిమేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఆధునిక 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. జులై 19న విడుదల అవుతుంది.
ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. నేటివిటీ ఎఫెక్ట్ కోసం లోకల్ స్టార్లతో డబ్బింగ్ చెప్పించారు. ఈ చిత్రంలో అతి కీలకమైన ముఫాసా పాత్రకు హీందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. అలాగే లయన్ కింగ్‌లో హీరో సింబా పాత్రకి హిందీలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగులో నేచురల్ స్టార్ నాని చెప్పారు.
విలన్ స్కార్ పాత్రకి జగపతి బాబు, టైమన్ అనే ముంగిస పాత్రకి ఆలీ, పుంబ అనే అడవి పంది పాత్రకి ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందం డబ్బింగ్ చెప్పారు. డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తోంది. ఈ చిత్రం విడుదల తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











