అందులో తొలి జాతీయ అవార్డు.. గర్వంగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్
జాతీయ అవార్డుల వేడుక సోమవారం నాడు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. తారలందరూ హాజరైన ఈ వేళ ఆ వేడుక అంతా కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు గెలుచుకుని అందర్నీ తలెత్తుకునేలా చేశారు. మహానటి, చిలసౌ, అ! లాంటి సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. వీటికి సంబంధించిన మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

అ! చిత్రానికి
ఈ కార్యక్రమంలో అ! చిత్రానికి గానూ ఉత్తమ మేకప్‌మ్యాన్ అవార్డును రంజిత్ అందుకున్నాడు. ఇక ఈ మూవీ నిర్మాత అయిన యంగ్ హీరో నాని.. భావోద్వేగానికి గురయ్యాడు. నిర్మాతగా మొదటి సినిమానే జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో ఆనందంలో మునిగిపోయాడు. తన అభిరుచికి తగిన సినిమాలను నిర్మించాలనే కోరికతో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించగా.. తొలి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ! అందర్నీ ఆశ్చర్యపరిచింది.
స్పందించిన నిర్మాత
కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన.. ఈ చిత్రానికి మేకప్ మేన్‌గా పనిచేసిన రంజిత్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. తెలుగు సినీ చరిత్రలో జాతీయ అవార్డు సాధించిన తొలి మేకప్ మేన్‌గా రంజిత్ నిలిచాడు. తాజాగా అవార్డు అందుకున్న రంజిత్ ఫొటోను నాని ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశాడు.

గర్వంగా ఉంది..
‘తెలుగు సినీ చరిత్రలో మేకప్ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తి రంజిత్. అందులోనూ మా ప్రొడక్షన్‌లో తొలి సినిమాతో. రంజిత్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. `అ` కోసం ఎంతో కష్టపడి పనిచేసిన పర్సనల్ మేకప్ మేన్లందరికీ ధన్యవాదాలు' అంటూ నాని ట్వీట్ చేశాడు.

కీర్తి సురేష్, రాహుల్‌కు అవార్డులు..
ఈ కార్యక్రమంలో చిలసౌ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అవార్డును అందుకున్నాడు. మహానటి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. ఇలా తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. కీర్తిసురేష్, రాహుల్ రవీంద్రన్‌లు అవార్డులు అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











