RRR KGF పుష్ప సినిమాలపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన 'దసరా' హీరో!

నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాందిచుకున్న హీరో నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ నుప్రారంభించిన నాని ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అలాగే హీరోగా డిఫరెంట్ కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా మారి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇటీవల హిట్ 2 సినిమాను నిర్మించిన నాని తాజాగా దసరా సినిమాతో రానున్నాడు. అయితే ఈ మూవీ టీజర్ సమయంలో వివాదాస్పదమైన RRR, కేజీఎఫ్ సినిమాల కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు నాని.

ఎన్నడూ కనిపించని లుక్ లో..

ఎన్నడూ కనిపించని లుక్ లో..

నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల తర్వాత వస్తున్న చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా 90 దశకం కాలం నాటి కథతో రూపొందింది. ఈ సినిమాలో నాని రా, రస్టిక్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతంలో కనిపించని తరహాలో నాని కనిపించాడు. ఇక ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నేను లోకల్ సినిమా తర్వాత వీరిద్దరు మరోసారి కలిసి నటించిన చిత్రమిది.

ఓరి వారి బ్రేకప్ లిరికల్ సాంగ్..

ఓరి వారి బ్రేకప్ లిరికల్ సాంగ్..


కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న దసరాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఓరి వారి' అనే బ్రేకప్ ఆంథమ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

పుష్ప, అల్లు అర్జున్ తో పోలికపై..

పుష్ప, అల్లు అర్జున్ తో పోలికపై..

దసరా 'ఓరి వారి' లిరికల్ సాంగ్ రిలీజ్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు నాని సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే దసరా టీజర్ లాంచ్ సమయంలో RRR KGF వంటి సినిమాలతో ఈ చిత్రాన్ని పోల్చడంపై ఒక రిపోర్టర్ అడగ్గా నాని క్లారిటీ ఇచ్చాడు. "ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ లుక్ చూసి పుష్పతో, అల్లు అర్జున్ తో పోల్చుతున్నారు. అలా పుష్ప వంటి నేషనల్ ఫినామినా అవ్వగలమని, ఆ అంచనాలు అందుకోగలమని అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు.

ఇలాంటి కథలు రాలేదు..

ఇలాంటి కథలు రాలేదు..

"మనకు ఉదాహరణకు సంవత్సరానికి 30 సినిమాలు వచ్చాయనుకోండి. లేదంటే లాస్ట్ పదేళ్లలో 500 సినిమాలు వచ్చాయనుకోండి. అందులో 495 సినిమాలలో హీరోలంతా ప్యాంటు, షర్ట్ లోనే కనిపిస్తారు. అలాగని వాళ్లనెప్పుడు సేమ్ లుక్ అని అనలేం. లుంగీ, బనియన్ లతో రూరల్ సినిమాలు చాలా రేర్ గా చేస్తుంటాం. లాస్ట్ టైమ్ బన్నీతో సుకుమార్ పుష్ప తీశారు. ఇక్కడ ఇలాంటివి ఇంకా అలాంటి గెటప్ కలిసేసరికి సేమ్ అనేస్తున్నాం. ఎందుకంటే.. ఇలాంటివి ఆల్రేడీ చాలా సినిమాలు వచ్చి ఉంటే.. ఈ కంపారిజన్స్, రిఫరెన్స్ లు ఉండేవి కాదు. మకు ఇదివరకు రూటెడ్ కథలు రాలేదు. అలా వచ్చిందే పుష్ప. అలాగే ఈ సినిమా కూడా. ఈ ఒక్క కంపారిజన్ తప్పితే.. ఒక్క చిన్న సెంటిమీటర్ సేమ్ కూడా ఉండదు" అని నాని తెలిపాడు.

ఆ చిత్రాలతో ఎలా పోల్చారు..

ఆ చిత్రాలతో ఎలా పోల్చారు..

అనంతరం "కాలేజీ ఫంక్షన్ లో టీజర్ లాంచ్ సమయంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలతో పోల్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంటే రాజమౌళి గారు సెన్సేషనల్ డైరెక్టర్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. అలాగే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాను ఆ చిత్రాలతో ఎలా పోల్చారు" అని ఒక రిపోర్ట్ ప్రశ్నించారు. "మీరు అడిగారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై కూడా క్లారిటీ ఇవ్వాలి" అని నాని అన్నారు.

 ఇది మేము చేసిన సినిమా..

ఇది మేము చేసిన సినిమా..

నాని కొనసాగిస్తూ.. "నేను ఒక టీజర్ కు సంబంధించి ఒక రివ్యూ కూడా చూశాను. ఆ సినిమాల్లాగా ఉంటుందా అని అన్నారు. మేం ఏం చెప్తామో.. అది కొన్నిసార్లు కాపీ పేస్ట్ చేసేసి మరొ రకంగా తీసుకుంటారు. నేను క్లియర్ గా చెప్పింది ఏంటంటే.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాగా అంటే రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు చేస్తాయా అని కాదు. అవి ఆ ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. నేను వాటిలాగా ఉంటాయనో.. ఆ సీన్స్ ఉంటాయనో అనట్లేదు. ప్రతి ఏడాది ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఇది మా ఇండస్ట్రీ మూవీ అని, ఇది మేము చేశాం అని చెప్పుకునే సినిమాలు ఉంటాయి. అలా లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చినట్లే.. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి దసరా రాబోతుంది. ఇది నేను మార్చి 30 వరకు ఈ మాటపై నిలబడి ఉంటాను. విడుదల అయ్యాక చెప్పండి నేను అన్నది కరెక్టా కాదా" అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X