Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్.. డిఫరెంట్ వింటేజ్ లుక్ తో షాక్ ఇచ్చిన నాని!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సోలోగా ఎదిగిన హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఈ స్టార్ హీరో ఎలాంటి మూవీస్ చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాయి. ఇక ఈసారి నాని తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం నాని లైనప్ ప్రాజెక్టులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందులో మొదట టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త పాత్రతో అలరించబోతున్నాడు నాని. నిన్నుకోరి మజిలీ వంటి హిట్ సినిమాలతో సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం శ్యామ్ సింగరాయ్ తో రానున్న నాని ఆ సినిమాలో విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడని ముందే ఒక టాక్ వచ్చింది. ఇక ఫైనక్ గా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా వింటేజ్ మాస్ లుక్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించనున్న ఆ సినిమా రీసెంట్ గా మొదలైంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సినిమాలో సాయి పల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.