నాని ‘గ్యాంగ్ లీడర్’.. ఓవర్సీస్ బిజినెస్ హాట్ టాపిక్
నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌కు సైతం మంచి స్పందన వచ్చింది, దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాని 'గ్యాంగ్ లీడర్' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 'సరిగమ సినిమాస్' వారు దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇందుకోసం వారు రూ. 5 కోట్లను చెల్లించినట్టుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్(సివిఎం) ప్రొడక్షన్ నెం.8 గా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ లో విడుదల కానుంది. నానితో పాటు కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, డార్లింగ్ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి, కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్, స్టిల్స్: జి.నారాయణరావు, విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: సనత్(ఫైర్ ఫ్లై) కో-డైరెక్టర్: కె.సదాశివరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











