నాని హిట్ 3 కాపీరైట్ వివాదం.. నోటీసులు పంపిన మద్రాస్ కోర్టు.. పూర్తి వివరాలు

నాని - శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్ 3 చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. బాక్సాఫీస్ వసూళ్లు పర్లేదనిపించింది. అయితే ఈ సినిమా కథ విషయంలో నేచురల్ స్టార్ నానికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా మద్రాస్ కోర్టు నుంచి నోటీసులు కూడా పంపించింది. ప్రముఖ రైటర్ సోనియా పిటిషన్ దాఖలు చేయడంతో కేసును విచారిస్తోంది. ఈ క్రమంలో నానికి నోటీసులు పంపించి వెంటనే స్పందించాలని ఆదేశించింది. అయితే నాని హిట్ 3 చిత్రం వివాదంలో ఎందుకు చిక్కుకుంది? సదరు రైటర్ ఎందుకు పిటిషన్ దాఖలు చేశారనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 రెస్పాన్స్, బాక్సాఫీస్ వసూళ్లు..
నియో-నోయిర్ యాక్షన్ ఫిల్మ్ జానర్ లో హిట్ 3 ఫిల్మ్ రూపుదిద్దుకుంది. నెల కింద మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ లో రూ.65 కోట్లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రశాంతి తిపిర్నేని, నేచురల్ స్టార్ నాని నిర్మాతలుగా వ్యవహరించారు. సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్, కార్తీక్ శ్రీనివాస్ ఎడిట్ చేసిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఓవర్సీస్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

Nani Hit 3 Movie Faces Leagal Issues At Madras High Court

హిట్ 3 వివాదం ఏంటీ?
హిట్ 3 మూవీ కథ తనను రచించిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథలోంచి కాపీ చేశారని రైటర్ సోనియా విమల్ ఆరోపించారు. చెన్నైకి చెందిన ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా తాజాగా మద్రాస్ హై కోర్టు నానికి నోటీసులు జారీ చేసింది. జూలై 7 వరకు గడువు ఇచ్చింది. ఆ లోపు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోరింది. ఇక ఇప్పటి వరకు హిట్ 3 మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

పిటిషన్ లో ఏమని ఆరోపించారంటే..
మద్రాస్ హైకోర్టుకు సోనియా విమల్ సమర్పించిన పిటిషన్ లో ఇలా ఆరోపించింది. 2021 ఆగస్టు 21న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైట్స్ అసోసియేషన్ లో ఆ రెండు కథలను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ప్రచురించ లేదని, ఇక నానితో సినిమా చేయాలని అవే కథలను 2022 ఆగస్టు 8న వినిపించానని, కాపీస్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ఇక నాని సినిమా చేయడానికి ఒప్పుకోకపోవడంతో వదిలేశామన్నారు.

కానీ హిట్ 3 చిత్రం విడుదలయ్యాక థియేటర్లలోకి వెళ్లి చూస్తే అచ్చం తన కథలానే ఉందని, చిన్న చిన్న మార్పులు చేశారని తేడాలను కూడా చూపించింది. ఇక ఈ సినిమా హక్కులను నిలిపివేసి, తదుపరి హక్కులను శాశ్వతంగా నిరోధించాలని కోరింది. ఇక తనకు సినిమాకు వచ్చిన ప్రాఫిట్స్ లో 20 శాతం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే సౌత్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లోనూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.

More from Filmibeat

Read more about: nani sailesh kolanu hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X