సుధీర్ బాబు మూవీలో నాని.. మొదలయ్యేది ఎప్పుడంటే?
గతేడాది 'సమ్మోహనం' మూవీతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత 'నన్ను దోచుకుందువటే', 'వీర భోగ వసంత రాయలు' చిత్రాలక్లో నటించారు. అయితే ఈరెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నాడు.
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 28న ఫార్మల్‌గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆసక్తికర విషయం ఏమింటంటే.. ఈ చిత్రంలో నాని ఎక్స్‌టెండెడ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట. ఈ మల్టీస్టారర్ మూవీలో అదితి రావు హైదరి, నివేథా థామస్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ కావడంతో నాని ఒప్పుకున్నారట.
ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి నాని నిర్మించబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ట్యూన్స్ కంపోజ్ చేయబోతున్నారు. మూవీ అఫీషియల్ లాంచ్ సందర్భంగా పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











