నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్

టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది నటుల్లో నాని ఒకడు. సహజ నటనతో న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. మధ్యలో మాస్ మంత్రం జపిస్తూ కాస్త సైడ్ ట్రాక్ అయినా మళ్లీ జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమాలో నటించి తనలోని నటుడిని మరోసారి అందరికీ పరిచయం చేశాడు. దీంతో నాని ఫామ్ కోల్పోలేదని అందరికీ తన సత్తా చూపించాడు.

 తాజాగా గ్యాంగ్ లీడర్ అంటూ..

తాజాగా గ్యాంగ్ లీడర్ అంటూ..

భిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. అయితే నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ఆ మూవీ ఫలితాన్ని అంతగా పట్టించుకోకుండా తదుపరి చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.

నెగెటివ్ రోల్‌లో..

నెగెటివ్ రోల్‌లో..

జెంటిల్‌మెన్ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విలనిజం పండించిన నాని.. పూర్తి స్థాయి రౌడీగా మారబోతోన్నాడు. సైకో కిల్లర్‌గా మారి ఎంత మందిని హతమారుస్తాడో చూడాలి. తనకు మొదటిసారి హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తోన్న వీ అనే చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో అష్టా చెమ్మా, జెంటిల్ మెన్ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.

తాజాగా మరో సినిమా..

తాజాగా మరో సినిమా..

కాగా ఇటీవలే నాని.. దర్శకుడు శివ నిర్వాణ తో ‘టక్ జగదీశ్' అనే ఓ చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ‘టక్ జగదీశ్' చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం నాని గుబురు గడ్డాన్ని ట్రై చేస్తున్నట్లు టాక్.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review

తెల్ల వెంట్రుకలు వచ్చేశాయ్..

గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా నాని బాగా పెరిగిన గడ్డం మెలితిప్పిన మీసంలో కనిపించాడు. తాజాగా నాని ఓ ఫోటోను షేర్ చేసి ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. తెల్ల జుట్టు వచ్చేసిందిరోయ్.. అంటూ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని పని అప్పుడే అయిపోయిందా? నానికి ఏజ్ అయిపోతుందా? అప్పుడే ఆ
సమస్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X