‘శ్రీకారం’ సినిమా నుంచి తప్పుకున్న స్టార్: ఆ సీన్స్ అందులో వాడుకోవడమేనట
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్. ఇప్పటికే ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసిన అతడు.. ప్రస్తుతం 'శ్రీకారం' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. వ్యవసాయం నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి ఓ స్టార్ హీరో తప్పుకున్నాడని.. అతడు ఈ నిర్ణయం తీసుకోడానికి వెనుక బలమైన కారణం ఉందని చెబుతూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'శ్రీకారం' సినిమాను మొదట నేచురల్ స్టార్ నానితో చేయాలనుకున్నారట. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయి, షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందనగా అతడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఇందులో దర్శకుడు చెప్పిన కొన్ని సన్నివేశాలను.. ఆ మధ్య వచ్చిన ఓ భారీ హిట్ సినిమాలో పెట్టుకోవడమే అని అంటున్నారు. ఇది యాధృచ్చికంగానే జరిగినప్పటికీ.. కాపీ కామెంట్లు వస్తాయన్న ఉద్దేశంతోనే నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాని తప్పుకున్న తర్వాత దర్శక నిర్మాతలు శర్వానంద్‌ను సంప్రదించారని, దానికి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. 'శ్రీకారం' అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











