గుమ్మడి కాయ కొట్టారు.. నాని, నాగ్ సెల్ఫీల పట్టుపట్టారు..
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాసు షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా మంగళవారం షూటింగ్స్ స్పాట్‌లో గుమ్మడి కాయ కొట్టి సెల్ఫీలతో హంగామా చేశారు. దేవదాస్ సినిమా షూటింగ్ పూర్తయింది. థ్యాంక్యూ టీమ్ దేవదాస్. ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉంది అని నాగార్జున ట్వీట్ చేశారు.
దేవదాస్ చిత్రంలో నాగార్జున దేవగా మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శమంతకమణి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ రూపొందించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత దేవదాసు టైటిల్‌ను దేవదాస్‌గా మార్చినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

nani nagarjuna devdas sriram aditya rashmika mandanna నాని నాగార్జున దేవదాస్ శ్రీరామ్ ఆదిత్య రష్మిక మందన్న


Click it and Unblock the Notifications