నేను, విక్రమ్ ఇంకా ఆ ఐదుగురు, అమ్మాయిల కోసమే... న్యూ మూవీపై నాని ట్వీట్!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన తర్వాతి సినిమా ప్రకటించేశాడు. మనం, 24, హలో చిత్రాలను రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన 24 చిత్రం ఖరారైనట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ మూవీరికి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మిగతా ఐదుగురు ఎవరు?
నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో :)) అంటూ నాని ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశారు. అయితే ఆ ఐదుగురు ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది.
అమ్మాయిలూ... స్పెషల్‌గా మీకోసమే
సినిమా గురించి దర్శకుడు విక్రమ్ కె కుమార్ వెల్లడిస్తూ... అమ్మాయిలు ఇది మీకోసమే ప్రత్యేకంగా అని ట్వీట్ చేయడం గమనార్హం. ఆయన ట్వీట్ చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన హార్ట్‌వార్మింగ్ మూవీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
మైత్రి మూవీస్
మైత్రి మూవీస్ సంస్థ నానితో చేస్తున్న తొలి చిత్రం ఇది. బడ్జెట్ పరంగా కూడా ఈ మూవీ నాని కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

నాని
ప్రస్తుతం నాని ‘జెర్సీ' సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే విక్రమ్ కుమార్ దర్వకత్వంలో వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ నేచురల్ స్టార్ 24న సినిమా మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











