National Film Awards 2019: జాతీయ అవార్డులు మా బాధ్యతను పెంచాయి: నేచురల్ స్టార్ నాని
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం అ!. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో అ! చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత నాని మాట్లాడుతూ - కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో అ! సినిమాను రూపొందించాం. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా నిర్మాణ సంస్థ తరుఫున తరపున జ్యూరీకి థ్యాంక్స్ అన్నారు.

కాగా, ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ అవార్డుల విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 'మహానటి', 'రంగస్థలం', 'అ!', చిలసౌ' చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి.


Click it and Unblock the Notifications











