Dasara సినిమాలో హైలెట్ కాబోయే సన్నివేశాలు ఇవే.. అలాంటి సీన్స్ తో ట్విస్ట్ ఇవ్వబోతున్న కీర్తి!
నేచురల్ స్టార్ నాని కెరీర్ ను మలుపు తిప్పే దసరా సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాని కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను కొంతమంది సెలబ్రిటీలు కూడా వీక్షించారు. ఇక వారి నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలు ఊహించిన విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక దసరా సినిమాలో హైలైట్ అయ్యే కొన్ని సన్నివేశాల వివరాల్లోకి వెళితే..

కొంచెం కూడా..
సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడుగా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అతని మొదటి సినిమానే ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతూ ఉండడం కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా గోదావరిఖని కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లుగా ముందుగానే పోస్టర్ల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. అయితే కథనం విషయంలో మాత్రం కొంచెం కూడా ఎక్కువగా వివరణ అయితే ఇవ్వలేదు

ఇంట్రడక్షన్ సీన్
ఇక ఈ సినిమాను చూసిన కొంతమంది సెలబ్రెటీలు మాత్రం చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సినిమాలో ముఖ్యంగా నాని కీర్తి సురేష్ కెమిస్ట్రీ హైలైట్ గా ఉండబోతుందట. నాని అయితే ధరణి పాత్రలో ప్రాణం పెట్టినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా అతని ఇంట్రడక్షన్ సీన్ నే ఊహించిన విధంగా ఉంటుందట. ఇక యాక్షన్స్ సీన్స్ కూడా రియాలిటీ కి తగ్గట్టుగానే ఎంతగానో ఆకట్టుకోబోతున్నట్లు టాక్.

కీర్తి నటన
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెయిన్ హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా కీర్తి చాలా సింపుల్ గా ఒక పల్లెటూరి అమ్మాయిల కనిపించబోతుందట. అయితే సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మాత్రం ఆమెలోని మరొక షేడ్ ఊహించిన విధంగా ఆకట్టుకుంటుందని, నాని అలాగే మరొక ముఖ్యమైన పాత్రతో కీర్తి నటించే విధానం కూడా ఈ సినిమాలో చాలా హైలెట్ కాబోతున్నట్లుగా చెబుతున్నారు. కీర్తి మాత్రం ఎప్పుడు నటించని సీన్స్ లో బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు కూడా టాక్ వస్తోంది.

గుండెలను హత్తుకునేలా
ఇక బొగ్గు గనుల్లో నాని కింద పడిపోయే సీన్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఉండే ఒక యాక్షన్ బ్లాక్ తో పాటు నాని స్టంట్స్ కూడా అబ్బుర పరుస్తాయని తెలుస్తోంది. ఇక నాని అయితే ఎక్కడ కాంప్రమైస్ కాకుండా ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు అని చెబుతున్నారు. ఇక కీర్తి సురేష్ తో కొన్ని లవ్ సీన్స్ కూడా ప్రేక్షకుల గుండెలను హత్తుకునేలా ఉంటాయట.

అతని పాత్రతో ట్విస్ట్
ఇక మరొక యువ నటుడు దీక్షిత్ కూడా ఈ సినిమాలో చాలా కీలకం కాబోతున్నాడు. ఇంకా అతని పాత్ర ద్వారానే సినిమాలోని కథ కూడా కీలక మలుపు తిరగబోతుందట సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానుంది. ఇక అతని నటన అలాగే నాని అతను ఒక గూడ్స్ ట్రైన్ లో చేసే పోరాట సన్నివేశాలు కూడా మెయిన్ హైలైట్ అవుతాయని తెలుస్తోంది. అక్కడ కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉందని చూసిన సెలబ్రిటీలు చెబుతున్నారు.

క్లైమాక్స్ మరింత హైలెట్
మేజర్ గా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ మాత్రం ఊహించని లెవెల్ లో ఉంటుంది అని ఫస్ట్ అఫ్ మొత్తం కూడా కాస్త కామెడీ అలాగే యాక్షన్ బ్లాక్ తో నిండి ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం ఊహించని ఎమోషనల్ డ్రామా అలాగే విలన్ ఆధిపత్య పోరు సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని టాక్ అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా కీర్తి సురేష్ కూడా సెకండ్ హాఫ్ లో నటించే విధానం అలాగే నానితో ఆమె చేసే డాన్స్ తో పాటు దీక్షిత్ కూడా వేసే స్టెప్పులు ఈ సినిమాలో ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











