ఎల్లమ్మను నాని ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా? చివరికి నితిన్ బుక్కయ్యాడా?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ - వేణు యెల్దండి కాంబినేషన్ లో చివరిగా 'బలగం' చిత్రం వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. జబర్దస్త్ వేదికపై నవ్వులు పూయించిన వేణు మెగా ఫోన్ పట్టుకొని తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక బలగం తర్వాత నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. ఈ చిత్రంలో తొలుత హీరోగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సడెన్ గా నితిన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నానిని కాదని, నితిన్ ను ఎల్లమ్మ చిత్రానికి హీరోగా ఎంపిక చేయడం వెనక జరిగిన కథ ఏంటో నిర్మాత దిల్ రాజ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
బలగం బాక్సాఫీస్ కలెక్షన్లు..
నిర్మాత దిల్ రాజ్ తన సొంత బ్యానర్ దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బలగం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2023, మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.1.25 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఓటీటీ రైట్స్ లెక్కలు అదనం. ఇలా చిన్న సినిమాగా వచ్చిన బలగం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సాధించింది. మరోవైపు దిల్ రాజ్ కు 20 రెట్లు లాభాన్ని తెచ్చి పెట్టడం విశేషం.

ఎల్లమ్మ చిత్రం హీరో ఛేంజ్..
తొలుత ఎల్లమ్మ చిత్రానికి నేచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. వేణు - నాని కాంబోలో సినిమాను లాక్ చేశారు. అయితే సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఉండటంతో నాని కాస్తా వెనకడుగు వేశారని ఓవైపు టాక్ వినిపిస్తోంది. మొత్తం ఫీమేల్ ఓరియెంటెడ్ గా ఉంటుందని ప్రచారం. దాంతో నాని పాత్రకు ప్రాధాన్యత ఉండదని భావించి వెనక్కి వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్మాత దిల్ రాజ్ స్పందిస్తూ నానికి పారడైజ్ చిత్రం డేట్స్ చాలా రోజులు ఉన్నాయని, దాంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వేణుతో చెప్పినట్టు చెప్పారు. దాంతర్వాత నితిన్ ను ఎంపిక చేసినట్టు చెప్పారు. అయితే దిల్ రాజ్ కూడా ఎల్లమ్మ అనే టైటిల్ ద్వారానే నాని ఒప్పుకోలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు.
నితిన్ ఎల్లమ్మ ముందుకు పడుతుందా?
టాలీవుడ్ స్టార్ నితిన్ వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. మ్యాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం, ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, రీసెంట్ గా తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. నితిన్ పై దిల్ రూ.75 కోట్లు పెట్టుబడి పెట్టగా బాక్సాఫీస్ నుంచి కేవలం రూ.10 కోట్ల వరకే తిరిగి వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
దీంతో దిల్ రాజ్ పై ఆర్థిక భారం పడింది. ఈ క్రమంలో ఎల్లమ్మ సినిమాకు నితిన్ ను ఉంచుకుంటారా? తీసేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రస్తుతం ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. బలగం సినిమాను 55 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ఎల్లమ్మ విషయంలోనూ దిల్ రాజ్ అదే ఫార్మూలాను వాడబోతున్నారని చెప్పారు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











