కేజీఎఫ్ రేంజ్‌లో అతడే శ్రీమన్నారాయణ.. టాలీవుడ్‌కు రష్మిక మాజీ ప్రియుడు
కేజీఎఫ్ లాంటి చిత్రంతో కన్నడ పరిశ్రమ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. మరోసారి అదే రేంజ్ స్టోరీతో కన్నడ ఇండస్ట్రీ పవరేంటో చూపించేందుకు రష్మిక మందాన్న మాజీ ప్రియుడు రోహిత్ శెట్టి వచ్చేస్తున్నాడు ప్యాన్ ఇండియన్ మూవీగా ఓ చిత్రాన్ని మలచాలంటే.. కథలో దమ్ముండాలి. కథ, కథనాలు బాగుంటే సినిమాను ఆపే వారెవరూ ఉండరు. అందుకే ప్యాన్ ఇండియా చిత్రాలనగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథలో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా అలాంటి ఓ చిత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటిస్తోన్న అతడే శ్రీమన్నారాయణ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. కేజీఎఫ్ లాంటి సినిమా చాయలు కనబడుతున్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఓ వైపు సీరియస్ టాపిక్ నడుస్తూనే.. అవుట్ అండ్ అవుట్ అండ్ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్టు కనిపిస్తోంది. యాక్షన్, కామెడీ ఇలా అన్నింటిని మిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను నాని రిలీజ్ చేశాడు.

ఈ మూవీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, అన్నింటికంటే ప్రత్యేకంగా ఉందని ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్లు ప్రకటించారు. సచిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 27 ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











