నిశ్శబ్దం ట్రైలర్ వచ్చేస్తోంది.. తెలుగులో నాని, హిందీలో ఎవరంటే..?
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. మూగ పాత్రలో స్వీటీ నటిస్తుండటం, మాధవన్ వంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు పెరిగాయి. పూర్తిగా అమెరికాలో చిత్రీకరంచిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ ఇలా ఐదు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చేసింది.
ఇప్పటికే ఈ చిత్రం విడుదలై ఉండాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రయూనిట్. అసలే వీక్ ప్రమోషన్స్‌తో సినిమాపై అందరూ విసిగెత్తి ఉండగా.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేందుకు సిద్దమైంది యూనిట్. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో చేత ట్రైలర్‌ను విడుదల చేయిస్తున్నారు.

తెలుగులో వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నాని మార్చి 6న 12.12గంటలకు విడుదల చేయిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా హిందీలో మనోజ్ భాజ్‌పేయ్ చేత రిలీజ్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఇక తమిళం, మలయాళం గురించి ఇంకా ప్రకటించలేదు. సుబ్బరాజ్, అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











