Nani డబ్బులు కొట్టేసిన ఆ డైరెక్టర్లు.. స్కామ్స్ బయటపెట్టిన నాని.. మోసపోవడం నా వల్ల కాదంటూ!
ఒకరు స్టార్ హీరో రేంజ్ కు ఎదగాలంటే అంతా ఈజీ కాదు. ఆ స్టార్ డమ్ వెనుక ఎంతో బాధ, ఆవేదన, మోసాలకు గురికావడం వంటివి అనేక సమస్యలు ఉంటాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడి తమ టాలెంట్ తో ముందుకు సాగుతుంటారు. అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లలో నేచురల్ స్టార్ నాని ఒకరు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిన నాని అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తర్వాత పక్కింటి అబ్బాయిగా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను అందిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం దసరా. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాస్ మహారాజా రవితేజతో సరదాగా ముచ్చటించాడు నాని.

పక్కింటి కుర్రాడి పాత్రలతో..
సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుకు పెట్టిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకోవడంతోపాటు పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. తాజాగా దసరా మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. 90వ దశకం కాలంలో బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

రెండోసారి జోడీగా..
న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా మూవీని పాన్ ఇండియా చిత్రంగా మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

వారం రోజులకు రవితేజ మూవీ..
దసరా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజతో సరదాగా ముచ్చటించాడు నాని. రవితేజ రావణాసుర సినిమా ఏప్రిల్ 7న అంటే నాని దసరా సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత విడుదల కానుంది. దీంతో వీరిద్దరు కలిసి వారి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఒక్క చిన్న పాత్రకు కూడా..
నాని, రవితేజ ఇద్దరు ఇదివరకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చాడు నాని. "ఒకరిద్దరు కో డైరెక్టర్లు నన్ను డ్రైవర్ కింద వాడుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఒక్క చిన్న పాత్రకు కూడా ఎవరూ నాకు కాల్ చేయలేదు" అని రవితేజతో నాని తెలిపాడు.

హీరోగా సక్సెస్ కాననుకున్నా..
"డ్రెస్సులు కూడా కొనుక్కోకుండా పండుగల కోసమని జాగ్రత్తగా దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసేవారు. అలాంటి స్కామ్స్ నేను ఫేస్ చేశాను. ఇక మళ్లీ మళ్లీ మోసపోవడం నా వల్ల కాదని నటుడిగా ప్రయత్నాలు ఆపేశాను. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను. అష్టా చమ్మాలో హీరో రోల్ కోసం ఆడిషన్స్ చేస్తున్నప్పుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి నా నటన నచ్చడంతో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ హీరోగా నేను సక్సెస్ కానని అనుకున్నా. కానీ నా అభిప్రాయం తప్పని అర్థమైంది" అని నాని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











