Nani: అందుకు చాలా టైమ్ పట్టేది.. పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డా.. నాని కామెంట్స్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించగా ఇప్పుడు దసరా మూవీతో రానున్నాడు. 90వ దశకం కాలంలో బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే ఇందులో హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల పాత్రలో ఆకట్టుకోనుంది. న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దసరా మూవీ ప్రమోషన్స్ లో వరసుగా పాల్గొంటున్న నాని తనకు జరిగిన ప్రమాదాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఈ వాఖ్యలు వైరల్ గా మారాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాను నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకొవచ్చు. రూ. 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దసరా చిత్రానికి ప్రిరిలీజ్ బిజినెస్ భారీగా జరగుతోందని సమాచారం.

ఇదిలా ఉంటే నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం వీరపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సింగరేణి లోకల్ రైళ్లలో బొగ్గును దొంగలించే యువకుడిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం మూవీ టీమ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగా నిర్విస్తున్నారు.
దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు నాని. ఇందులో భాగంగానే తాజాగా ఆసక్తిర విషయాలు చెప్పుకొచ్చాడు నాని. నా మేకప్ కోసం ప్రతిరోజు చాలా సమయం కేటాయించాల్సి వచ్చేది. షూటింగ్ సమయంలో అత్యంత వేడి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సెట్ లో రెండు సార్లు పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డాను. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఒక మంచి సినిమా రూపొందింది. ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది అని నాని తెలిపాడు. ఇక ఈ దసరా సినిమా RRR, పుష్ప లా గుర్తుండిపోతుంది అని నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











