Ante Sundaraniki: ఆ రెండు భాషల్లోనూ నాని సినిమా.. స్పెషల్ సర్‌ప్రైజ్ లోడింగ్

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ఆ తర్వాత హీరోగా మారాడు నేచురల్ స్టార్ నాని. ఆరంభంలోనే తనదైన శైలి సహజ సిద్ధమైన నటనతో అందరి దృష్టిలో పడిపోయిన అతడు.. ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. సుదీర్ఘ కాలంగా హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న నాని.. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది.

'జెర్సీ' వంటి భారీ సక్సెస్ తర్వాత నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత ఈ నేచురల్ స్టార్ వరుసగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వీ', శివ నిర్వాణతో 'టక్ జగదీష్' మూవీలు చేశాడు. ఈ రెండు చిత్రాలు ఓటీటీల్లోనే నేరుగా రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అతడి ఫ్యాన్స్ వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పోయిన ఏడాది చివర్లో 'శ్యామ్ సింగ రాయ్' అనే మూవీతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. దీంతో ఈ సినిమా సూపర్ హిట్‌ అయింది.

Nanis Ante Sundaraniki Release in Tamil and Malayalam

నేచురల్ స్టార్ నాని ఇప్పటికే 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామ్ సింగ రాయ్ హిట్ తర్వాత అతడు దీన్ని రెట్టించిన ఉత్సాహంతో కంప్లీట్ చేసుకున్నాడు.

Nanis Ante Sundaraniki Release in Tamil and Malayalam

నాని తన గత చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'ను దక్షిణాది భాషల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఫాలో అవుతూ 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని కూడా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతేకాదు, తమిళంలో ఈ చిత్రానికి 'ఆడాడే సుందర' అని, మలయాళంలో 'ఆహా సుందరా' అనే టైటిళ్లు పెట్టినట్లు కూడా వెల్లడించారు. అన్నింటికీ మించి ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందని కూడా ప్రకటించారు. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

విభిన్నమైన సబ్జెక్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడని ఇప్పటి వరకూ విడుదలైన పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, అతడి పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని అంటున్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం జూన్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X