HBD Nani: గుడ్ న్యూస్ చెప్పిన నాని.. ‘అంటే’ అప్పుడే వస్తున్నాడట

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు నాని. ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో పాటు సహజ సిద్ధమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. నేచురల్ స్టార్ అన్న బిరుదుకు చక్కగా సరిపోయాడు. ఇక, రోజులు గడిచిన తర్వాత కమర్షియల్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న నాని.. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, అతడికి ఆ రేంజ్ సక్సెస్ మాత్రం దక్కలేదు.

'జెర్సీ' తర్వాత నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత ఈ నేచురల్ స్టార్ వరుసగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వీ', శివ నిర్వాణతో 'టక్ జగదీష్' మూవీలు చేశాడు. ఈ రెండు చిత్రాలు ఓటీటీల్లోనే విడుదల అయ్యాయి. దీంతో థియేటర్ మూవీ కోసం అతడి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో 'శ్యామ్ సింగ రాయ్' అనే మూవీతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా కలెక్షన్లు కూడా అదే రీతిలో వచ్చాయి. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్‌ అయింది.

Nanis Ante Sundaraniki Release on June 10th

చాలా రోజుల క్రితమే నాని 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామ్ సింగ రాయ్ హిట్ తర్వాత అతడు దీన్ని రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేసేశాడు.

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'అంటే.. సుందరానికీ' మూవీ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారమే ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక, ఈరోజు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఇక, 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

విభిన్నమైన సబ్జెక్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'అంటే.. సుందరానికీ' మూవీలో నేచురల్ స్టార్ నాని సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నాడని ఇప్పటి వరకూ విడుదలైన పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X