Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సత్యం థియేటర్ ఉండాల్సింది.. ఎంత మజా వచ్చేదో.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో నానికి, అమీర్‌పేట్ లోని సత్యం థియేటర్ కి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. చదువుకునే రోజుల్లో నాని సత్యం థియేటర్లో క్యూ లో నిల్చొని టికెట్ తీసుకొని సినిమాలు చూసేవారు. ఆ మధురానుభూతులు ఎలా మారిపోగలుగుతాడు చెప్పండి. అందుకే మరోసారి సత్యం థియేటర్ అనుభూతి గురించి తెలిపారు నేచురల్ స్టార్ నాని. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'ఫలక్‌నుమా దాస్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన నాని ఈ సత్యం థియేటర్ ప్రస్థావన తీసుకొచ్చారు. ఈ సందర్బంగా 'ఫలక్‌నుమా దాస్' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు నాని.
వేదికపై నాని మాట్లాడుతూ.. ''ఈ ఈవెంట్‌కు రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం. రెండోది నేను 10 ఏళ్ల యాక్టింగ్ తర్వాత కొత్త కథలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 'వాల్‌పోస్టర్' అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించాను. దాంట్లో నెక్ట్స్ ప్రొడక్షన్లో విశ్వక్ సేన్ చేయబోతున్నాడు. ఇక మూడోది, అసలైనది.. నిన్నే ఫలక్‌నుమాదాస్ సినిమా నాకు చూపించారు. నాకు తెలిసి ఇప్పటిదాకా జరిగిన ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా చీఫ్ గెస్ట్ సినిమా చూసి వచ్చుండరు. నేను చూసొచ్చి మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ అయ్యో.. సత్యం థియేటర్ పడగొట్టకుండా ఉండాల్సింది అనిపించింది. ఈ సినిమా అమీర్‌పేట సత్యం థియేటర్లో చూసుంటే మంచి మజా వచ్చుండేది. పర్లేదు.. శ్రీరాములు అని పక్కన ఇంకో థియేటర్ ఉంది. అందులో చూద్దురుగానీ'' అని అన్నారు నాని.
''ఫలక్‌నుమా దాస్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఎలాంటి లొకేషన్స్‌లో షూట్ చేశారో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అది ఎంత కష్టమో. ఇలాంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్‌ను బయటకు తీసుకొచ్చారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కొత్తగా వస్తున్న టెక్నీషిన్స్ను గానీ, యాక్టర్స్‌ను గానీ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది'' అని ఈ సందర్బంగా పేర్కొన్నారు నాని. వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై ఫలక్‌నుమా దాస్ నిర్మితమవుతోంది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న విడుదల కానుంది.