హాయిగా నిద్రపోయిన నాని.. సూపర్ హిట్ అయితేనే లేపండి అంటూ కామెంట్
జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్'. ఈ రోజే (సెప్టెంబర్ 13 న) ఈ సినిమా విడుదల కానుంది. దీంతో తన సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, రిసల్ట్ ఎలా రాబోతుంది అనే దానిపై ఆసక్తికరంగా స్పందిస్తూ ట్వీట్ చేశాడు నాని.
''సూపర్ హిట్ అయితే లేపండి.. లేకుంటే డోంట్ డిస్టర్బ్. గ్యాంగ్ లీడర్ సినిమా మీ అందరి ప్రేమ చూరగొంటుందని ఆశిస్తున్నా.. మీ పెన్సిల్ పార్థసారథి'' అంటూ తన పెన్సిల్‌కి పదును పెట్టాడు నాని. ఈ మేరకు సీనియర్ నటి లక్ష్మి భుజంపై హాయిగా నిద్రిస్తున్న పిక్ షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఒకరకంగా మొదటి రోజు సినిమా ఆటకు ముంచే ఇది ఓ డిఫెరెంట్ ప్రమోషన్ అని చెప్పుకొవచ్చు. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ చుసిన ఆడియన్స్ గ్యాంగ్ లీడర్ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందించబడింది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. ఓ ఆడవాళ్ళ గ్యాంగ్‌కి లీడర్‌గా నాని నటన బాగా ఆకట్టుకుందనేది ఇప్పటివరకు అందిన సమాచారం.


Click it and Unblock the Notifications











