Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాని ‘గ్యాంగ్ లీడర్’ మేకింగ్ వీడియో... సూపర్ ఫన్!
నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం మేకింగ్ వీడియో విడుదల చేశారు. సినిమా ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ మేకింగ్ వీడియో కూడా అదే విధంగా కట్ చేశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో నాని రివేంజ్ స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నారు. నాని తన గ్యాంగ్‌తో కలిసిచేసే పనులు థియేటర్లో నవ్వులు పూయించబోతున్నాయి. ఆర్ఎక్స్ 100 కార్తికేయ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీను సిరిగి..సీటులిరిగి..సీటీ కొట్టాలోయి.. అంటూ సాగే సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. నానితో పాటు ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్, స్టిల్స్: జి.నారాయణరావు, కో-డైరెక్టర్: కె.సదాశివరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.