For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాని ‘గ్యాంగ్ లీడర్’ మేకింగ్ వీడియో... సూపర్ ఫన్!

|

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం మేకింగ్ వీడియో విడుదల చేశారు. సినిమా ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ మేకింగ్ వీడియో కూడా అదే విధంగా కట్ చేశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్‌ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో నాని రివేంజ్ స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నారు. నాని తన గ్యాంగ్‌తో కలిసిచేసే పనులు థియేటర్లో నవ్వులు పూయించబోతున్నాయి. ఆర్ఎక్స్ 100 కార్తికేయ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సీను సిరిగి..సీటులిరిగి..సీటీ కొట్టాలోయి.. అంటూ సాగే సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నానితో పాటు ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Nanis Gang Leader Movie Making

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

English summary
Nani's Gang Leader Movie Making on Mythri Movie Makers. Nani's Gang Leader 2019 latest Telugu movie co ft. Karthikeya, Priyanka Arul Mohan and others. Directed by Vikram Kumar. Music by Anirudh Ravichander. Produced by Y Naveen, Y Ravi and Mohan Cherukuri under Mythri Movie Makers banner.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more