‘గ్యాంగ్ లీడర్’ టీజర్: ఇక నుంచి నో లవ్ రివైంజర్.. ఓన్లీ పగ.. పగ.. పగ..
నేచురల్ స్టార్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మొదటి నుంచీ సరికొత్త పంథాను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఒక్కో రోజు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ వస్తోంది.
సినిమా ప్రారంభం సమయంలోనే టైటిల్ టీజర్ విడుదల చేయగా, ఈ మధ్య కొద్ది రోజుల గ్యాప్‌లో ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌లు విడుదల చేశారు. వీటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. గతంలో ప్రకటించిన దాని ప్రకారం చిత్ర యూనిట్ తాజాగా 'గ్యాంగ్ లీడర్' టీజర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు చిత్ర హీరో నాని దీనికి సంబంధించిన లింక్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అంతేకాదు, 'నా గ్యాంగ్.. విక్రమ్ కథ.. అనిరుథ్ సౌండ్.. మైత్రీ డబ్బు.. మన సినిమా.. మీ ఎంటర్‌టైన్‌మెంట్.. గ్యాంగ్ లీడర్ టీజర్ వచ్చేసింది' అని పేర్కొన్నాడు.

ఈ టీజర్ కామెడీగా ఉంటూనే, ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ ప్రారంభంలో నాని.. పెన్సిల్‌గా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత అతడు ఏవేవో సీడీలు చూస్తూ స్క్రిప్టులు రాస్తుంటాడు. తర్వాత సీన్‌లోకి బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను ఇలా ఐదుగురు ఆడవాళ్ల రివేంజర్స్ బృందం వస్తుంది. వీళ్లు నానితో కలవడం.. వాళ్లలో ఒకరైన హీరోయిన్‌తో 'ఇక నుంచి నో లవ్ రివైంజర్.. ఓన్లీ పగ.. పగ.. పగ.. ' అని చెప్పడం చూపించారు. అంతేకాదు, ఇందులో 'RX100' హీరో కార్తికేయను కూడా ఒక ఫ్రేమ్‌లో చూపించారు. మొత్తానికి ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.


Click it and Unblock the Notifications











