నాని గ్యాంగ్ లీడర్ ట్విట్టర్ రివ్యూ: బోర్ కొట్టకుండా లాక్ చేశారు
Recommended Video
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13న (ఈ రోజు) సినిమా విడుదల కానుంది. దీనికి ఒక రోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. ఆ ఆడియన్స్ అభిప్రాయమేంటో చూద్దామా..
ఫస్టాఫ్ అండ్ సెకండాఫ్
గుడ్ ఫస్టాఫ్ విత్ సూపర్ సెకండాఫ్.. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తన టాలెంట్ అంతా బయటపెట్టాడు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా గ్యాంగ్ లీడర్.
ఇంటర్వెల్ టచ్ సూపర్
ఇంటర్వెల్ బాంగ్, వెరీ నైస్ ఫస్టాఫ్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ సింప్లెస్ట్ సినిమా ఇది. ఇంటర్వెల్ టచ్ సూపర్. నటనలో నాని చించేశాడు.
గుడ్ బట్ నాట్ గ్రేట్
గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఫ్లో కాస్త తగ్గింది. సడెన్ గా సినిమాకు శుభం కార్డు పడింది. కానీ సినిమాలో మనసుకు హత్తుకునే ఎన్నో సన్నివేశాలున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. నాని యాక్టింగ్ బాగుంది. గుడ్ బట్ నాట్ గ్రేట్.
డీసెంట్ మూవీ.. లవ్లీ పర్‌ఫార్‌మెన్స్ నాని అండ్ కార్తికేయ
గ్యాంగ్ లీడర్ డీసెంట్ మూవీ. సెకండాఫ్ ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్. కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. లవ్లీ పర్‌ఫార్‌మెన్స్ నాని అండ్ కార్తికేయ. నైస్ మూవీ.
రొటీన్ స్టఫ్ మూవీ..
గ్యాంగ్ లీడర్ బోరింగ్ మూవీ. అనిరుద్ బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ తప్ప రొటీన్ స్టఫ్. అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
సింపుల్ ఆవేరేజ్ డ్రామా.. కార్తికేయ సెట్ అయ్యాడు
డీసెంట్ సినిమా.. సింపుల్ ఆవేరేజ్ డ్రామా విత్ డైరెక్టర్ విక్రమ్ టచ్. నాని అండ్ గ్యాంగ్ బాగా యాక్ట్ చేశారు. ఆ రోల్‌కి కార్తికేయ సెట్ అయ్యాడు. అనిరుద్ మ్యూజిక్ బాగుంది.
బోర్ కొట్టకుండా లాక్ చేశాడు
ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్‌ని లాక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ విక్రమ్. చాలా రోజుల తర్వాత గ్యాంగ్ లీడర్ రూపంలో మంచి సినిమా చూశాం.
గుడ్ అటెంప్ట్ ఫర్ విక్రమ్ కుమార్
ఇది ఖచ్చితంగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ చేసిన మంచి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. గ్యాంగ్ లీడర్ సినిమా చాలా సింపుల్ గా చూడదగినదిగా ఉంది. నానికి ఆల్ ది బెస్ట్.
ఫుల్లుగా ఎంజాయ్ చేసాం
నాని గారు వాట్ ఏ స్టోరీ సెలక్షన్. సచ్ ఏ క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీ. బాగా ఎంజాయ్ చేశాం


Click it and Unblock the Notifications











