‘గ్యాంగ్ లీడర్’ రికార్డు స్థాయిలో.. నాని కెరీర్‌లోనే ఇలా జరగడం తొలిసారి

టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని - క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాని సినిమా కావడం, దానికి తోడు ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో 'గ్యాంగ్ లీడర్'పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

 Nanis Gang Leader Will Release Highest locations

ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్ లీడర్'ను భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాను 200 పైగా లొకేషన్లలో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని టాక్. దీనికి కారణం నానికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉండడమేనని సమాచారం. వాస్తవానికి నాని కెరీర్‌లో ఇప్పటికి ఆరు సార్లు 1 మిలియన్ మార్కను అందుకున్నాడు. దీన్ని మరోసారి రిపీట్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

మరోవైపు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే హీరోయిన్. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ ఎల్ఎల్‌పీ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారం గ్యాప్‌లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X