సెన్సార్ పూర్తి చేసుకున్న HIT.. విడుదలకు ముందే హింట్!
నాని నిర్మాణంలో రూపొందిన HIT మూవీ విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసిన సెన్సార్ బోర్డు చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయొచ్చని గేరేన్ సిగ్నల్ ఇస్తూ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. తాజాగా సెన్సార్ రిపోర్ట్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మేరకు యాక్షన్ నుంచి రొమాన్స్ వరకు సినిమాలో యువతకు కావాల్సిన అన్ని అంశాలుంటాయని విడుదలకు ముందే హింట్ ఇచ్చారు.
నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై HIT మూవీ రూపొందింది. ఈ సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరించింది. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో ఉన్న నాని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకొని రూపొందించారు నాని.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ HIT సినిమా హిట్టయినట్లే అని చెప్పకనే చెప్పేశాయి. ఈ చిత్రంలో ఓ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు ఛేదించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్ జనం.


Click it and Unblock the Notifications











