నాని కెరీర్‌లో రెండో ప్రయోగం.. 'హిట్' అంటూ వచ్చేశాడు
నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తూనే సరికొత్తగా ప్రయోగాలకు దిగుతున్నాడు. చాలా రోజుల క్రితమే నిర్మాత అవతారం కూడా ఎత్తిన ఈ నాచురల్ స్టార్ 'అ' అనే డిఫరెంట్ మూవీ నిర్మించి తనలోని విలక్షణత చాటుకున్నారు. 'అ' సినిమా కమర్షియల్‌గా అంత సక్సెస్ కానప్పటికీ, ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.
'అ' తర్వాత మళ్ళీ హీరోగా సత్తా చాటుతూ ఇటీవలే 'జెర్సీ' రూపంలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో తన రెండో ప్రాజెక్టుకు క్లాప్ కొట్టేశారు నాని. 'హిట్' అనే పేరుతో తన నిర్మాణంలో రాబోతున్న రెండో సినిమాకు కొద్ది సేపటి క్రితమే పూజా కార్యక్రమాలు నిర్వహించారు నాచురల్ స్టార్ నాని.

సెన్సషనల్ స్టార్ విశ్వక్ సేన్ హీరోగా వాల్ పోస్టర్స్ బ్యానర్‌పై హిట్ అనే సినిమా నిర్మిస్తున్నారు నాని. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తోంది. ఈ సినిమాతో శైలేశ్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పింది చిత్రయూనిట్.
మరోవైపు హీరోగా నాని చేస్తున్న 'V' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా నాని కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం.


Click it and Unblock the Notifications











