twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేవదాస్’ మూవీ డిలీటెడ్ సీన్: నాని పెర్ఫార్మెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

    |

    అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవదాస్‌'. ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది.

    సినిమా ప్రమోషన్లో భాగంగా ఎడిటింగులో లేపేసిన కొన్ని సీన్లను వైజయంతి మూవీస్ వారు యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. తాజాగా విడుదలైన సీన్లో నాని పెర్పార్మెన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సీన్ ఎంతో అద్భుతంగా ఉందని, సీనిమాలో ఉండే బావుండేది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    ఇందులో... కార్పొరేట్ ఆసుపత్రి యజమానిగా ఉన్న రావు రమేష్‌.... స్లమ్ ఏరియాలో పని చేసిన వచ్చిన నీకు తిరిగి ఉద్యోగం ఇవ్వడం కుదరుదు అని డాక్టర్ దాస్(నాని)కు చెప్పడంతో.... కోపం కట్టలు తెచ్చుకుని ఆవేశంలో నాని చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

    గడిచిన మూడు నెలల్లో నేను ఎన్ని కేసులు ట్రీట్ చేశానో తెలుసా? ఈ హాస్పటల్‌లో ఏ ఒక్క డాక్టర్ కూడా తన ఎంటైర్ లైఫ్ టైమ్‌లో అన్ని కేసులు ట్రీట్ చేసి ఉండరు. ఇక్కడికి ఎలాంటి కేసులు వస్తారు? మహా అయితే తుమ్ము, దగ్గు, జలుబు, లేదంటే సూసైడ్, యాక్సిడెంట్ అంతే కదా!. పెన్సిల్‌తో గొంతులో కసా కసా పొడిచేశారు... నేను ట్రీట్ చేశాను. తలకాయను బల్లకేసి దబాదబా బాదితే నరాలు చిట్లిపోయాయి... నేను కుట్లు వేశాను. షార్ప్‌గా ఉన్న పేపర్ తో గొంతు కోసయొచ్చు తెలుసా? మీకు... నా చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా? మీ 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడైనా ఇలాంటి కేసులు హ్యాండిల్ చేశారా?.... అంటూ నాని ఆవేశంగా డైలాగులు చెప్పడం అదిరిపోయింది.

    Nanis Hospital Deleted Scene from Devadas

    నా కర్మకాలి మాఫియాతో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ నా వర్క్ ఎప్పుడూ మరిచిపోలేదు. నా వల్ల మీ ఆసుపత్రి రెప్యుటేషన్ దెబ్బతింటుందా? సాటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి సార్, అది స్లమ్స‌లో అయినా... కార్పొరేట్ ఆసుపత్రిలో అయినా... మాఫియా అయినా, మామూలు మనిషి అయినా... చేసేది డాక్టర్ పనే అంటూ నాని డైలాగ్స్ అదరగొట్టాడు.

    English summary
    Here is Nani's Hospital Deleted Scene from #Devadas Movie. Starring Nagarjuna Akkineni Nani, Rashmika Mandanna, Aakanksha Singh, Naresh VK, Bahubali Prabhakar, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas, Satya. Directed by Sriram Aditya, Produced by Ashwini Dutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X