ప్రభాస్ 'సాహో'పై నాని కామెంట్.. గ్యాంగ్ లీడర్ గురించి ప్రస్తావిస్తూ!

Recommended Video

Nani's Interesting Tweet On Prabhas Saaho Movie || Filmibeat Telugu

టాలీవుడ్ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాసి తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది 'బాహుబలి' మూవీ. ఇందులో నటించిన నటీనటులందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. దీంతో ఆయన తర్వాతి సినిమా 'సాహో' పై భారీ హైప్ నెలకొంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సాహో' సినిమాపై నాని ఆసక్తికరంగా స్పందించాడు.

సాహో కారణంగా పలు సినిమాలు వాయిదా

సాహో కారణంగా పలు సినిమాలు వాయిదా

మొదట సాహో మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుందని ప్రకటించిన చిత్రయూనిట్ ఆ తర్వాత కొని కారణాల వల్ల దానిని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అప్పటికే ఆగస్టు 30 విడుదల తేదీగా నిర్ణయించుకున్న నాలుగు సినిమాలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నాయి. అందులో నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఒకటి.

పలు సినిమాల వాయిదాపై ప్రభాస్ రియాక్షన్

పలు సినిమాల వాయిదాపై ప్రభాస్ రియాక్షన్

ఆగస్టు 30వ తేదీన సాహో సినిమా కారణంగా తమ తమ చిత్రాల విడుదల తేదీలు రీ-షెడ్యూల్‌ చేసుకున్నందుకు ఆ చిత్ర నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు బిగ్‌ థాంక్స్‌. 'సాహో' చిత్ర బృందం తరఫున ధన్యవాదాలు. మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని రెండు రోజుల క్రితం ప్రభాస్ ట్వీట్ చేశాడు.

'సాహో'పై నాని కామెంట్.. గ్యాంగ్ లీడర్

ఈ నేపథ్యంలో తాజాగా 'సాహో' సినిమాపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేశాడు. ''సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే మిన్నంటే సంబరాలు ఉంటాయి. ప్రభాస్ అన్నకి ఆల్ ది బెస్ట్. ఆగస్టు 30 వ తేదీన హ్యూజ్ బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది. రేపు (ఆగస్టు 9) గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం'' అని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు నాని.

భారీ బడ్జెట్ మూవీ 'సాహో'

భారీ బడ్జెట్ మూవీ 'సాహో'


యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, చుంకీ పాండే లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరత్వరగా ముగించి హై రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X