ప్రేమికుల రోజున నాని రెడీ.. 14న జెర్సీ ఫస్ట్ సింగిల్
దేవదాస్ సినిమా హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం జెర్సీ. క్రికెట్ క్రీడా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎస్ నాగవంశీ నిర్మాతగా గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నది. ఈ చిత్రంలో సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నది.
ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అదేంటో గానీ ఉన్నపాటుగా అనే పాటను ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

నటీనటులు: నేచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా
సాంకేతిక వర్గం:
మ్యూజిక్:అనిరుధ్ రవిచంద్రన్
కెమెరామాన్ :సాను వర్గీస్
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా
ఎడిటర్ :నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి


Click it and Unblock the Notifications











