అలా మొదలై, ఇలా ముగిసింది: ‘జెర్సీ’ మూవీ హైలెట్స్ ఇవే!

Recommended Video

Nani's Jersey Movie Highlights

నాని కెరీర్లోనే విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం 'జెర్సీ'. నాని.. అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలో కనిపించారు. 26 ఏళ్ల వయసులోనే పలు కారణాలతో ఆటకు దూరమైన అర్జున్ రిటైర్ అయ్యే వయసులో మళ్లీ బ్యాట్ పట్టడానికి కారణమేంటి? క్రికెట్ ప్రపంచంగా బ్రతికే అతడు దానికి ఎందుకి దూరం అయ్యాడు అనేది వివరిస్తూ అర్జున్ ఎమోషనల్ జర్నీని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాను ఎలా మొదలు పెట్టి ఎలా ముగించారు, ఇందులోని హైలెట్స్ ఏమిటో ఓ లుక్కేద్దాం.

న్యూయార్క్‌లో మొదలైన స్టోరీ

న్యూయార్క్‌లో మొదలైన స్టోరీ

సినిమా తొలి సీన్ న్యూయార్కులో మొదలైంది. అర్జున్ కుమారుడు ఇక్కడ పని చేస్తుంటాడు. తన తండ్రి జీవితంపై ‘జెర్సీ' అనే పుస్తకం రాసే నేపథ్యంలో అతడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

ఫ్లాష్ బ్యాక్

ఫ్లాష్ బ్యాక్

అర్జున్ కుమారుడు కథ చెప్పడం మొదలవ్వగానే మూవీ 1986 నాటి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లింది. క్రికెట్ స్టేడియం‌లో నాని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలను పరిచయం చేయగానే కథ మరో పదేళ్లు ముందుకు అంటే.. 1996 వెళుతుంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

అర్జున్, కొడుకు మధ్య ఆకట్టుకునే సీన్స్

అర్జున్, కొడుకు మధ్య ఆకట్టుకునే సీన్స్

మంచి క్రికెటరైన అర్జున్.... కొన్ని కారణాలతో ఆటను వదిలిపెడతాడు. పదేళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. అర్జున్, అతడి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. క్రికెట్ కోచ్ పాత్రలో సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ బావుంది.

చారిటీ మ్యాచ్ కోసం ప్రాక్టీస్

చారిటీ మ్యాచ్ కోసం ప్రాక్టీస్

పదేళ్ల తర్వాత ఓ చారిటీ మ్యాచ్ కోసం నాని మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఎమోషనల్ సన్నివేశాలతో ఇంటర్వెల్ పడుతుంది. అలా సినిమా తొలి భాగాన్ని దర్శకుడు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు.

హైదరాబాద్ టీంకు ఎంపిక

హైదరాబాద్ టీంకు ఎంపిక

మళ్లీ క్రికెట్లో అడుగు పెట్టాలని భావించిన అర్జున్ తాను అనుకున్నది సాధిస్తాడు. హైదరాబాద్ రంజీ టీంకు ఎంపికవుతాడు. హైదరాబాద్, ముంబై రంజీ ఫైనల్ మ్యాచ్ చిత్రీకరించిన విధానం భావోద్వేగాలకు గురి చేస్తుంది.

అర్జున్, సారా

అర్జున్, సారా

సినిమాలో అర్జున్, సారా(శ్రద్ధా శ్రీనాథ్) మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి స్పోర్ట్స్ డ్రామాలో ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసిన విధానం ఆకట్టుకుంది. అయితే కొన్ని చోట్ల ఫ్యామిలీ డ్రామా సీన్లు కాస్త సాగినట్లు ఉన్నా పెద్దగా బోర్ అనిపించదు.

సినిమాలో హైలెట్స్

సినిమాలో హైలెట్స్

‘జెర్సీ' మూవీలో ఇంటర్వెల్ ఎపిసోడ్... ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ హైలెట్ అయ్యేలా చిత్రీకరించారు. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X