జెర్సీలో క్రికెటర్ అర్జున్‌గా నాని.. ఏప్రిల్ 19న రిలీజ్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న 'జెర్సీ' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Nanis Jersey movie set to release on April 19th

జెర్సీ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ: జెర్సీ చిత్రం నాకు సినిమాగానే కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుంది అనుకుంటున్నాను, ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది అని అన్నారు.

అర్జున్ క్యారెక్టర్‌లో నాని ఒదిగిపోయారు. ఈ చిత్రం ఇంత సక్సెస్‌ఫుల్‌గా రావడానికి ముఖ్య కారణమైన నాని గారికి, అన్ని విధాలుగా సహకరించిన మా నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు అని దర్శకుడు గౌతమ్ తెలిపారు.

Nanis Jersey movie set to release on April 19th

నిర్మాత మాట్లాడుతూ మా 'జెర్సీ' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ చిత్రం మా బేనర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

నటీనటులు: నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం.

Nanis Jersey movie set to release on April 19th

సంగీతం: అనిరుద్ రవిచందర్
కెమెరా: సాను జాన్ వర్గీస్
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్)
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్,
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X