ఆసక్తి రేపుతున్న 'జెర్సీ' పోస్టర్.. టీజర్ ఎప్పుడంటే!
2018 సంవత్సరం నేచురల్ స్టార్ నానికి నిరాశ మిగిల్చింది. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు నిరాశ పరిచాయి. ఈ ఏడాది నాని విభిన్నమైన చిత్రాలతో రాబోతున్నాడు. నాని ప్రస్తుతం మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో జెర్సీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ కనిపించింది.
ఇప్పటివరకు ప్రేమ కథలలో నానిని చూసిన అభిమానులు తొలిసారి క్రికెటర్ గా చూడబోతున్నారు. తాజాగా ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసి టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. నాని గ్రౌండ్ లో క్రికెట్ దుస్తుల్లో పరిగెడుతున్న లుక్ బావుంది. జెర్సీ చిత్ర టీజర్ ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జెర్సీ చిత్ర టీం ప్రేక్షకులకు అందించే సంక్రాంతి కనుక ఇదే.

క్రికెటర్ గా నటించేందుకు నాని ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటిస్తాడు.


Click it and Unblock the Notifications











